సీఏఏ నుంచి ఒలింపిక్స్ బిడ్డింగ్ వరకు... బీజేపీ మేనిఫెస్టో లోతెంతో చూడండి!

14-04-2024 Sun 15:32 | National
Advertisement
  • సంకల్ప పత్ర పేరుతో మేనిఫెస్టో విడుదల చేసిన బీజేపీ
  • యువత, మహిళలు, పేదలు, రైతులను దృష్టిలో ఉంచుకుని మేనిఫెస్టోకు రూపకల్పన
  • దూరదృష్టితో పలు హామీలకు రూపకల్పన 
Advertisement
ఎన్డీయే కూటమిని నడిపిస్తున్న బీజేపీ ఇవాళ తన ఎన్నికల మేనిఫెస్టో 'సంకల్ప పత్ర'ను ప్రజల ముందుకు తీసుకువచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇందులోని కీలక అంశాలను వివరించారు. ప్రధానంగా దేశానికి మూలస్తంభాలు అనదగ్గ నాలుగు వర్గాలు యువత, మహిళలు, పేదలు, రైతులను సంతృప్తి పరిచేలా మేనిఫెస్టోకు రూపకల్పన చేసినట్టు తెలుస్తోంది. 

14 ముఖ్యమైన హామీలతో కూడిన బీజేపీ మేనిఫెస్టో నిశితంగా పరిశీలిస్తే... దూరదృష్టితో అనేక హామీలను పొందుపరిచినట్టు అర్థమవుతుంది. సీఏఏ, ఒక దేశం ఒకే ఎన్నిక, జాతీయ విద్యా విధానం, ఒలింపిక్ ఎన్నికల బిడ్డింగ్ వంటి అంశాలను మేనిఫెస్టోలో ప్రస్తావించారు. 

బీజేపీ సంకల్ప పత్రలో ఉన్న కీలక అంశాలు...

  • చైనా, పాకిస్థాన్, మయన్మార్ సరిహద్దుల పొడవునా మౌలిక సదుపాయాల అభివృద్ధి వేగవంతం. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో సరిహద్దు కంచెల అభివృద్ధి.
  • కేవలం ఒక్క దశాబ్ద కాలంలో భారత్ 11 నుంచి 5వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. ఇప్పుడు భారత్ ను ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలపడమే బీజేపీ లక్ష్యం.
  • 2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులు భారత్ చేజిక్కించుకునేందుకు ప్రణాళిక బద్ధ కృషి.
  • సీఏఏ (పౌరసత్వ సవరణ చట్టం) అమలుకు బీజేపీ కట్టుబడి ఉంది.
  • రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 ప్రకారం ఉమ్మడి పౌర స్మృతి అమలు చేస్తాం.
  • ఒకే దేశం ఒకే ఎన్నిక మా నినాదం... ఇప్పటికే దీని సాధ్యాసాధ్యాలపై కమిటీ వేశాం. కమిటీ సిఫారసులు వచ్చాక కార్యాచరణ ఉంటుంది.
  • దేశంలో ఉన్నతస్థాయి విద్యాప్రమాణాలకు వేదికలుగా ఉన్న ఐఐటీ, ఐఐఎం, ఏఐఐఎంఎస్ వంటి జాతీయస్థాయి విద్యా సంస్థలను మరింత బలోపేతం చేస్తాం. వాటికి నిధుల కేటాయింపు, సామర్థ్యం పెంపు, మౌలికసదుపాయాల వృద్ధి, పరిశోధనలకు ప్రత్యేక నిధులు అందిస్తాం.
  • పీఎం గరీబ్ కల్యాణ్ యోజన కింద మరో ఐదేళ్ల పాటు 80 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్.
  • పేద కుటుంబాలకు పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద ఉచిత విద్యుత్ అందిస్తాం.
  • పారిశ్రామిక, వాణిజ్య కేంద్రాల సమీపంలో మహిళల కోసం హాస్టళ్ల నిర్మాణం... మహిళల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత.
  • పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీలు తదితర చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచడం కోసం నారీ శక్తి వందన్ అభియాన్ పథకం.
  • నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందేలా ఆయుష్మాన్ భారత్ పథకం  పరిధిలోకి దేశంలోని అందరు వృద్ధులు.
  • రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద అందించే రూ.6000 ఆర్థికసాయం కొనసాగింపు.


Advertisement
BJPSankalp PatraManifestoNarendra ModiIndia

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more